శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం నాయకులు విఫలమయ్యారని ఐఎన్‌టీయూసీ నాయకులు విమర్శించారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్‌రావులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు వారు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రాతినిధ్య సంఘంగా తాము కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, యజమాన్యంతో తమ యూనియన్ నేత జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ డి మాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. సింగరేణిని అధోగతి పాలు చేసిన టీబీజీకేఎస్‌కు తమను విమర్శించే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్, నాయకులు భీంరావు, గరిగే స్వామి, తిరుపతిరాజు, బాపు, సత్యనారాయణ, భీమన్న తదితరులు పాల్గొన్నారు.


