తాండూర్: మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న తంగళ్లపల్లికి చెందిన గోగు బాలకృష్ణ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్సెట్టిపేట జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి కోర్టు వాయిదాలకు నిందితులు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.


