ఆదిలాబాద్‌రూరల్: న్యూఢిల్లీలో ఈ నెల 25, 26వ తేదీలలో నిర్వహించనున్న 10వ రాష్ట్రీయ జనజాతీయ, లోక్ సంస్కృతి సాహిత్య ఫెస్టివల్‌కు తనకు ఆహ్వానం అందినట్లు మావల మండలంలోని వాఘాపూర్ గ్రామానికి చెందిన గోండి భాష రచయిత తొడసం కై లాష్ తెలిపారు.
మానవహక్కుల చైర్మన్‌కు ఘన స్వాగతం
జన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్‌కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్‌పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్‌తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్‌డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.


