శ్రీరాంపూర్: ఎన్నికల్లో ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుందన్నారు. కార్మికులకు సాధారణ ఎన్నికల్లో, గు ర్తింపు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, వంగ తిరుపతి, బాకం నగేశ్, గుంట జగ్గయ్య, జనార్ధన్, కాటం రాజు, పొగాకు రమేశ్, ఆకునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.


