బోథ్‌లో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ప్రతీ అసెంబ్లీ సమావేశాల్లో బోథ్‌లో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రస్తావించా. పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశా. ప్రభుత్వం దిగివచ్చి ఫైర్‌స్టేషన్ మంజూరు చేసింది. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
కాంగ్రెస్ ప్రభుత్వంవల్లే మంజూరు
కాంగ్రెస్ పార్టీ వల్లే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరైంది. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని ఫైర్‌స్టేషన్ మంజూరు చేసింది. ఫైర్‌స్టేషన్ మంజూరుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి సైతం కృషి చేశారు. – ఆడె గజేందర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి


