నేడు విద్యుత్‌ ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ ప్రజావాణి

Mar 23 2026 8:23 AM | Updated on Mar 23 2026 8:23 AM

ఆదిలాబాద్‌టౌన్‌: వినియోగదారుల వి ద్యుత్‌ సమస్యల పరి ష్కారానికి ప్రతీ సోమవారం విద్యుత్‌ ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యుత్‌ శాఖ ఎస్‌ ఈ ఆర్‌.శేషారావు తెలి పారు. సర్కిల్‌, డివిజన్‌, సబ్‌డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. వినియోగదారులు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం లభిస్తుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం డివి జన్‌ ఆఫీసులు, ఈఆర్‌వో, సబ్‌డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సర్కిల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇప్పటి వరకు విద్యుత్‌ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1,469 సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను సమీప కార్యాలయంలో నమోదు చేసుకొని పరిష్కారం పొందాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement