‘నేటి ర్యాలీ విజయవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘నేటి ర్యాలీ విజయవంతం చేయాలి’

Mar 23 2026 8:23 AM | Updated on Mar 23 2026 8:23 AM

ఆదిలాబాద్‌టౌన్‌: భగత్‌సింగ్‌ స్ఫూర్తితో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ, టీఏవీఎస్‌, ఐద్వా, తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా కార్యాలయం నుంచి భగత్‌సింగ్‌చౌక్‌ వరకు నిర్వహించనున్న ర్యాలీ విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ 22 ఏళ్ల వయసులోనే బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుల ని కొనియాడారు. వారి 95వ వర్ధంతిని పురస్కరించుకుని సమసమాజ నిర్మాణం, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ ఈ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్‌, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, ఐ ద్వా జిల్లా కార్యదర్శి మంజుల, టీఏవీఎస్‌ జిల్లా కా ర్యదర్శి ఆత్రం కిష్టు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement