ఇంద్రవెల్లి: గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప టేల్ అన్నారు. డీసీసీ కార్యదర్శులుగా ఎంపికై న ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఎండీ మ సూద్, మెస్రం నాగ్‌నాథ్‌ను ఆదివారం ఉట్నూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్‌కు, ఎమ్మెల్యే బొజ్జుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు రాథోడ్ మోహన్‌సింగ్, రాథోడ్ రోహిదాస్, కుంర రాజేశ్వర్, నాయకులు జహీర్, కొమురయ్య పాల్గొన్నారు.
ఉత్సవాలు విజయవంతం చేయాలి
ఉట్నూర్‌రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి దాసండ్ల ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆర్టీఐ జిల్లా మెంబర్ దూట రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


