ఆదిలాబాద్‌రూరల్: పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యు వతి ఆత్రం సమ్మక్క హత్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నింది తులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ హక్కు ల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశా రు. గురువారం మావల మండలం కుమురంభీంగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సమ్మక్కను ప్రేమ పేరిట మోసగించి హత్య చేసిన నిందితుడితోపాటు అతడికి సహకరించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సులు నమోదు చేయాలని కోరారు. బాధిత కు టుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా, కు టుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంది ర, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత, తు డుం దెబ్బ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండలాధ్యక్షుడు వేడమ ముకుంద్‌రావ్, నాయకులు గోవిందరావ్, నాగోరావ్, వెట్టి బొజ్జు, సోము తదితరులున్నారు.


