జాతీయ సదస్సుకు బేల ప్రిన్సిపాల్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ సదస్సుకు బేల ప్రిన్సిపాల్‌

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

జాతీయ

జాతీయ సదస్సుకు బేల ప్రిన్సిపాల్‌

● బెల్లంపల్లి చిన్నారికి సినిమా అవకాశం

కై లాస్‌నగర్‌(బేల): మహారాష్ట్రలోని దారాశివ్‌ జిల్లా కేంద్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఛత్రపతి సంబాజీనగర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరిగిన వృక్షశాస్త్ర జాతీయ స్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వరప్రసాద్‌రావు పాల్గొన్నారు. వృక్షశాస్త్రంలో వస్తున్న మార్పులు, వాటిపై ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్సీ వినియోగ ప్రభావం అనే అంశంపై ప్రసంగించారు. సదస్సులో నిర్వాహకురాలు రేఖతాయి మహాజన్‌, ప్రిన్సిపాల్‌ చౌదరి, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్తలు డా.అదే, డా.కులకర్ణి డా.ఉద్దవ్‌ భాలే, డా.సావ్లె, డా.అనిత లింగే పాల్గొన్నారు.

రీల్స్‌ నుంచి రీల్‌కు ..

బెల్లంపల్లి: బుడిబుడి నడకలు..ముద్దులొలికే మాటలతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఆచిన్నారికి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తన నటన ప్రతిభతో అ బ్బుర పరిచి రీల్స్‌ నుంచి రీల్‌కు ఎంపికై ంది. బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీకి చెందిన అనిత, నీలమేఘనాథ్‌ దంపతుల కుమార్తె ఆ యూ చార్వీ. తండ్రి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ఆయూ చార్వీ హైదరాబాద్‌లో ఉంటోంది. ఆరేళ్ల వయస్సు కలిగిన ఆమె యూకేజీ చ దువుతోంది. నాలుగేళ్ల నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం ఆరంభించింది. రెండేళ్ల వ్యవధిలో లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లను కూడగట్టుకుంది. మరోవైపు ఓ ప్రఖ్యాత టీవీ సీరియల్‌లో హీరో కూతురు పాత్రలో నటిస్తోంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నటించనున్న ఓ సినిమాలో కూతురు పాత్ర కోసం గత నెలలో ఆడిషన్‌ నిర్వహించగా ఆయూ చార్వీ ఎంపికై ంది. ఆ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని, త్వరలోనే షూటింగ్‌ జరగనుందని అనిత తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ముధోల్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని నయాబాదికి చెందిన దొంతులవార్‌ సాయి ట్రాలి ఆటోతో, లవాడే గంగాధర్‌ ద్విచక్ర వాహనంపై బస్టాండ్‌ వైపు బయలుదేరారు. ఆటో డ్రైవర్‌ సాయి ఎలాంటి సూచిక ఇవ్వకుండా కుడి వైపునకు తిప్పడంతో వెనుక వైపు నుంచి వస్తున్న గంగాధర్‌ ఆటోను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపారు.

జాతీయ సదస్సుకు బేల ప్రిన్సిపాల్‌1
1/1

జాతీయ సదస్సుకు బేల ప్రిన్సిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement