ఆర్జీయూకేటీలో ‘టీమ్ గరుడ’ ఆవిష్కరణ
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సహకారంతో ‘3డీ ప్రింటింగ్ డిజైన్’ అనే అంశంపై వారం రోజుల కార్యక్రమం కొనసాగుతోంది. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఎస్‌ఏఈ ఇండియా ఆర్జీయూకేటీ బి కొలీజియట్ క్లబ్ ఆధ్వర్యంలో ‘టీమ్ గరుడ’ రూపొందించిన బాజా ఎస్‌ఏఈ ఇండియా వాహనం, ఐఎస్‌ఎన్‌ఈఈ గోకార్ట్ 3.0 ఆవిష్కరించారు.
వాహనాల ప్రత్యేకతలు..
స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన బాజా వాహనం ఆఫ్‌రోడ్ ప్రాంతాల్లో అధిక పనితీరు, భద్రత, మన్నిక కలిగి ఉంటుంది. గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ మోడల్‌గా పర్యావరణ హితంగా, సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్‌తో నిలిచింది. డిజైన్, విశ్లేషణ, తయారీ, పరీక్షలతో విద్యార్థుల సామూహిక కృషి ఈ వాహనాలకు ఆకృతి చేసింది. 30 మంది విద్యార్థులు బాజా వాహనంతో ఈనెల 24న పీవీఆర్‌ఐ నర్సాపూర్‌లో జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. 18 మంది విద్యార్థులు గోకార్ట్ వాహనంతో 19న కోయంబత్తూర్‌లో పోటీపడతారు.
ప్రత్యేక అభినందనలు
వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ విద్యార్థుల అంకితభావాన్ని ప్రశంసించి, వాహనాన్ని పరీక్షించారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని కొనియాడారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. సింప్లిఫోర్జ్ ఆర్‌అండ్‌డీ హెడ్ డాక్టర్ హనుమాన్ నాయక్ నైపుణ్యాలను అభినందించా రు. ఫ్యాకల్టీ అడ్వైజర్లు డాక్టర్ కె.మహేశ్, మిస్టర్ రా హుల్ మాట్లాడుతూ.. డిజైన్ నుంచి టెస్టింగ్ వరకు విద్యార్థులు పడిన శ్రమను వివరించారు. తమకు సహకరించిన స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వాహనాల తయారీ స్పాన్సర్లు..
బాజా ఎస్‌ఏఈ ఇండియా తయారీకి స్నేహహస్తాలు ఫౌండేషన్, పారి ఫౌండేషన్, సంచారి, లోర్వెన్ ఏఐ, లయన్స్ క్లబ్, డీఎస్ సాలిడ్‌వర్క్స్, ఐఎస్‌ఎన్‌ఈఈ గోకార్ట్ తయారీకి యునైటెడ్ వే హైదరాబాద్, ఫ్యూచర్ టెక్ ఫౌండేషన్, డీఎస్ సాలిడ్‌వర్క్స్, అన్సిస్, ఈఈఎస్, వీఆర్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్, పీఎస్ అసోసియేషన్ లాంటి కంపెనీలు టీమ్ గరుడకు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. స్పాన్సర్‌తో పాటు విద్యార్థులు కొంత డబ్బు సమకూర్చుకొని ఈ వాహనాలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎస్.విఠల్, ఎస్.శేఖర్, డాక్టర్ కె.మహేశ్, డా.పీవీ. చంద్రశేఖర రావు, అన్పత్ రాహుల్, చరణ్‌రెడ్డి, అనుపమ శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
బాజా వాహనం నడుపుతున్న వీసీ గోవర్ధన్
ఆర్జీయూకేటీలో ‘టీమ్ గరుడ’ ఆవిష్కరణ


