ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా కమిటీ ఎన్నిక
మంచిర్యాలటౌన్: తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. రమేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఏ.శ్రీనివాస్, కోశాధికారిగా సీహెచ్. సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ.రాజేందర్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా హెచ్.మహేంద్ర, వైస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్‌చారి, సీహెచ్. వరప్రసాద్, ఎండి రఫీక్, స్రవంతి, జాయింట్ సెక్రెటరీలుగా ఎండి రఫీయిద్దీన్, పి.తిరుపతి, ఈ.విజయలక్ష్మి, ఎన్.అంజన్న, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా హకీమ్, ఎన్.సుధాకర్, సురేష్, నీరజ దేవి, సత్యం, ఈసీ మెంబర్లుగా రాజేశ్వరి, జి.విష్ణుమూర్తి, శ్రావణి, రాజమణి, తిరుమల ఎన్నికయ్యారు.


