రోడ్డెక్కిన పత్తి రైతులు
బోథ్: సొనాల మండల కేంద్రంలోని గురుసాహెబ్ చందా జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రహదారిపై పత్తి బండ్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ పత్తి కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పండించిన పంటను ఎవరికి అమ్ముకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. అదే సమయంలో జిన్నింగ్‌ను పరిశీలించేందుకు వచ్చిన సీసీఐ విజిలెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పూజ వారితో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 20వరకు కొనుగోళ్లు ఉంటాయని, నాణ్యత గల పత్తిని మాత్రమే సేకరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి విఠల్, ఏవో దేవ, ఆర్‌ఐ శ్యాంసుందర్ రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. 18 పత్తి బండ్లలో నాణ్యత పరిశీలించి ఆరు బండ్ల పత్తి కొనుగోలుకు అంగీకరించారు. దీంతో మిగతా రైతులు నిరసన కొనసాగించారు. సమాచారం అందుకున్న బోథ్ ఎస్సై పురుషోత్తం అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు ఉంటాయని, సంయమనం పాటించాలని వారిని సముదాయించారు. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు.
నల్ల బెల్లం, పటిక పట్టివేత
కడెం: కారులో తరలిస్తున్న నల్లబెల్లం, పటిక బుధవారం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రంగస్వామి తెలిపారు. దోస్త్‌నగర్ గ్రామానికి చెందిన బొడ్ల శంకర్ పెద్దూర్ తండాకు నల్లబెల్లం, పట్టిక తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు పాండ్వపూర్ సమీపంలోని వంతెన వద్ద పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈదాడుల్లో 380 కిలోల బెల్లం, 30 కిలోల పటిక, 20 లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బొడ్ల శంకర్, ఇస్లావత్ శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్, సిబ్బంది వెంకటేశ్, ఇర్ఫాన్, నరేందర్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.


