నిందితులు కోర్టుకు హాజరయ్యేలా పర్యవేక్షించాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నమోదైన ప్రతీ కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు జారీ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో జి ల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో శనివారం సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్స్, అనుమానస్పద రౌడిషీటర్స్‌పై నమోదైన కేసుల స్థితిగతులపై సమీక్షించారు. కోర్టుకు హాజరు కాని వారి పై ఎన్‌బిడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు. కోర్టుల్లో నేరస్తులకు శిక్షలు ప డుతున్న సందర్భంలో సమాజంసన్మార్గం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, సీఐలు, ఎస్సైలు, కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


