నిర్భయంగా ఓటేయండి
తలమడుగు: ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. మండలంలోని సుంకిడి, తలమడుగు, బరంపూర్, కజర్ల, దేవాపూర్ గ్రామాల్లో సోమవారం ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు విడతల్లో 140 మందిపై 60 కేసులు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సైలు రాధిక, జీవన్‌రెడ్డి, సిబ్బంది తదితరులున్నారు.
గుడిహత్నూర్: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ఓటేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం సా యంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇందులో ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ: మండలకేంద్రంతో పాటు వడూర్, బుగ్గారం(బి), కొరిటికల్(బి)లలోని సమస్యాత్మ క పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ప్ర లోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, ఎస్‌సై ఇమ్రాన్, సిబ్బంది ఉన్నారు.


