మూడోసారి జాతీయస్థాయి పోటీలకు..
సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రాథోడ్ రితేష్ నాయక్ ఆటలో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రులు గోవింద్ నాయక్, వనిత బాయి ప్రోత్సాహంతో క్రీడాపోటీల్లో సత్తా చాటుతున్నాడు. రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడోసారి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో, 2024లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్వహించిన 43వ జూనియర్ నేషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. వనపర్తిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్‌లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో ప్రతిభ కనబర్చాడు. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సీనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో, ఈ ఏడాది నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు.
రాథోడ్
రితేష్ నాయక్


