ఉత్సాహంగా జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను అధ్యక్షుడు సాయిని రవికుమార్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం పెంపొందుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలపై దృష్టి సారిస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఐదు గ్రూపుల్లో పోటీల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.అంతకుముందు రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను డీటీఎస్‌వో పార్థసారథి పరిశీలించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.


