రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శం
ఆదిలాబాద్‌రూరల్: అంబేడ్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శమని ఎంపీ గోడం నగేశ్, ఎ మ్మె ల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వ ర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. బౌద్ధ వందనం స్వీకరించి పంచశీల జెండా ఆవిష్కరించారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరం పోస్టర్ ఆ వి ష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు కదలాల్సిన అవసరముందని తెలిపా రు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీంరావ్ వాఘ్మరే, ప్రధాన కార్యదర్శి దాదాసాహెబ్ జాబడే, భారతీయ బౌద్ధ మహా సభ నేత కాంతారావ్, మాతా రమాబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు దయశీల ఉకే, సభ్యులు కుష్‌వర్త బాయి లాంగ్డే, నీలాబాయి తదితరులు పాల్గొన్నారు.


