బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

Dec 6 2025 7:39 AM | Updated on Dec 6 2025 7:39 AM

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

● కలెక్టర్‌ రాజర్షిషా

కై లాస్‌నగర్‌: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందులో పాల్గొనే వారందరిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బాల్‌ వివాహ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, ష్యూర్‌ ఎన్జీవో సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యా రు. పండితులు, మౌలానా, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేస్తే వారి భవిష్యత్తుతో పాటు పు ట్టబోయే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని తెలిపా రు. అనంతరం బాల్య వివాహం చట్టపరమైన నేరం హెచ్చరిక వాల్‌పోస్టర్‌ను సంబంధిత మత పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సలోని చాబ్రా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ వెంకట్‌ స్వామి, సభ్యులు సమీర్‌ ఉల్లాఖాన్‌, దశరథ్‌, డేవిడ్‌, ష్యూర్‌ ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్‌ వినోద్‌, అర్చక సంఘం సభ్యులు, చర్చి పాస్టర్లు, మౌలానా ఖాజీలు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డి నేటర్‌ సతీశ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దేశభక్తి అలవర్చుకోవాలి

విద్యార్థి దశ నుంచే దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. సాయుధ ద ళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని ఎన్‌సీసీ కేడెట్లు చేపట్టిన విరాళాల సేకరణను తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహా యార్థం ఎన్‌సీసీ కేడెట్స్‌ అధిక మొత్తంలో విరా ళా లు సేకరించాలని సూచించారు. వాటిని సైని క సంక్షేమ సహాయ నిధి ఖాతాలో జమచేస్తామని తెలిపా రు. మాజీ సైనికులు శంకర్‌, దేవన్న పాల్గొన్నారు.

స్టేజ్‌–2 అధికారుల పాత్ర కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తొలి విడత ఎన్నికల అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టి ఫలితాలు ప్రకటించాక వాటి వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అంతకు ముందు ఆర్‌వోల ఎన్నికల విధుల నిర్వహణపై మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ వారికి శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు టి. వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, జిల్లా శిక్షణ నోడల్‌ అధికారి మనోహర్‌, డీపీవో రమేశ్‌, డీఎల్‌పీఓ ఫణిందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement