ఎన్నికల నిబంధనలు పాటించాలి
నేరడిగొండ/తలమడుగు/బజార్‌హత్నూర్/బోథ్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధి కారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. నేరడిగొండ, తలమడుగు, బజార్‌హత్నూర్, బోథ్, సొ నాల మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నేరడిగొండ ఎంపీడీవో కార్యాలయంలో భద్రపర్చిన ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ‘టిపోల్’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవోలు శేఖర్, శంకర్, ఆర్‌వో పవన్, ఏఆర్‌వో గంగయ్య తదితర సిబ్బంది తదితరులున్నారు.


