‘సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్రలు’
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్ర లను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే శంకర్ చే తులు కలిసి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్‌కు అప్పగించే దిశగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణ కో సం కేటీఆర్‌తో వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట మోసపూరిత కా ర్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ విజయోత్సవ సభలను విమర్శిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేశంకర్ మాత్రం సీఎంను పొగడ్తలతో ముంచెత్తడం రెండు పార్టీల మధ్య ఉన్న కుట్ర ను బట్టబయలు చేస్తోందన్నారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు ప్రహ్లాద్, సాజితోద్దీన్, రమేశ్, జగదీష్, శ్రీని వాస్, ప్రశాంత్ తదితరులున్నారు.


