ఏకగ్రీవం దిశగా..
నేరడిగొండ: మండలంలో ఏడు సర్పంచ్ స్థానా లకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. రాజురా, ఆరెపల్లి, కొర్టికల్(కె), కుంటాల(కె), వెంకటాపూర్, కుంటాల(బి), లఖంపూర్(జి) గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వగ్రామమైన రాజురా సర్పంచ్, ఉపసర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నా రు. సర్పంచ్‌గా జాదవ్ స్వరాజి, ఉపస ర్పంచ్‌గా రాథోడ్ బాపురావు, వార్డుసభ్యులుగా మీరా బాయి, సంజుల, రెనాబాయి, అశోక్ , మెగాజీ, రాథోడ్ బాపురావు, సాయమ్మ, అమర్సింగ్‌ను ఎన్నుకున్నారు.
బజార్‌హత్నూర్‌లో రెండు జీపీలు ..
బజార్‌హత్నూర్: మండలంలోని భూతాయి (కే), చింతలసాంగ్వి జీపీల్లో గ్రామపెద్దలు శు క్రవారం సింగిల్ నామినేషన్లు వేయించి సర్పంచ్, ఉపసర్పంచ్‌లతోపాటు వార్డుమెంబర్ల ను ఏకగ్రీవం చేసుకున్నారు. చింతలసాంగ్వీ స ర్పంచ్‌గా మడవి పద్మలత,ఉపసర్పంచ్‌గా నీలకంఠ, భూతాయి(కే) సర్పంచ్‌గా సింధుజైతు, ఉపసర్పంచ్‌గా భీంరావ్ ఎన్నికయ్యారు.


