ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ని ష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మతపరమైన, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేయాలని అన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై ధైర్యం నింపాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు చేయాలని, గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీ లు జరగకుండా పర్యవేక్షించాలని చెప్పారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. వీడీసీ ఆగడాలను అరికట్టాలని, మద్యం అక్రమ రవాణా ను అడ్డుకోవాలని, గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకుండా వేలం పాటలు వేసే వారిపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేని సందర్భంలో వీహెచ్‌ఎఫ్ సెట్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ల వారీగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గ్రా మాల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాల ని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రత్యక్ష, పరోక్ష రాజ కీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రభావి తం చేసే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సూచించా రు. సమావేశంలో మల్టీ జోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, బి.సురేందర్‌రావు, ఏఎప్పీ చిత్తరంజన్, పి.మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్, పోతారం శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, సీఐలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి


