పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలి
కై లాస్‌నగర్: ఆర్‌వో, స్టేజ్–2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలన్నారు. నిర్దేశించిన జాబితా ప్రకారం ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉన్నాయో లేదో చూడాలని తెలిపారు. సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు అనువైన వాహనాలు వెంటనే సమకూర్చాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జనరల్ అబ్జర్వ ర్స్ టి.వెంకన్న, ఎల్.విజయ, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


