ఐఐఎస్‌ఎఫ్‌కు ఎంపిక
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్) 2025కు ఎంపికయ్యారు. ఈనెల 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకులాల్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకుల వినూత్న ఆలోచనలు, సాంకేతిక అభివృద్ధి పరిశోధనలను ప్రదర్శించే అతిపెద్ద వేదికల్లో ఐఐఎస్‌ఎస్ ఒకటన్నారు.
గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మార్గశిర పౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 201 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు.
దత్తాత్రేయ జయంతి వేడుకలు..
మండలంలోని గూడెం శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం శ్రీ దత్తసాయి జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. అష్టోత్తర శతకలశ పూజలు, పాలాభిషేకం, పల్లకి సేవ, తదితర పూజలు చేశారు.
13 మంది బైండోవర్
కై లాస్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 13 మంది పాత నేరస్తులను బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేల మండలంలోని చప్రాలకు చెందిన పలువురు పాత నేరస్తులను గురువారం బేల తహసీల్దార్ రఘునాథ్ రావు ఎదుట బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
ఐఐఎస్‌ఎఫ్‌కు ఎంపిక
ఐఐఎస్‌ఎఫ్‌కు ఎంపిక


