● క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య ● తల్లి ప్రేమకు దూరమైన
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్, మృతురాలి కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. ఉట్నూర్ మండలం బిర్సాయిపేటకు చెందిన ఏళ్ల ర జిత (27)కు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మాన్కుగూడకు చెందిన సుదర్శన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత సుదర్శన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రజితకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతులకు ఇద్దరు పిల్లలు (రెండేళ్ల పాప, ఆరు నెలల బాబు)ఉన్నారు. మరోవైపు సుదర్శన్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ‘నువ్వు సచ్చిపోతే.. నేను మరో అమ్మయిని పెళ్లి చేసుకుంటా’ అని వేధించేవాడు.
పంచాయితీలు జరిగినా మారలేదు..
సుదర్శన్–రజిత దంపతుల గొడవలపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పెద్ద ల ముందు సక్రమంగా ఉంటానని చెప్పే సుదర్శన్ తర్వాత తన పాత పద్ధతినే కొనసాగించాడు. ఎప్పటికై నా మారకపోతాడా అని రజిత ఎదురు చూసింది. కానీ, భర్త నిత్యం తాగి వచ్చి సూటిపోటి మా టలు అనడం.. సచ్చిపో అని వేధించడాన్ని తట్టుకో లేకపోయింది. ఈ క్రమంలో బుధవా రం ఉదయం దంపతులు గొడవ ప డ్డారు. అనంతరం సుదర్శన్.. తన భా ర్య తమ్ముడు రవికి ఫోన్ చేసి.. మీ అక్క ను తీసుకుపో అని చెప్పాడు. దీంతో ర వి సాయంత్రం వచ్చాడు. ర జితను బైక్ పై తీసుకుని పుట్టింటికి బయల్దేరారు.
భర్త మాటలు భరించలేక..
ఈ క్రమంలో మండలంలోని ఘన్‌పూర్ గ్రామం వద్దకు రాగానే భర్త అన్న మాటలు, వేధింపులు గుర్తుకురావడంతో రజిత కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలో బైక్ పైనుంచి ఒక్కసారిగా కిందికి దూకి అడవిలోకి పరుగెత్తింది. అప్పటికే చీకటి పడడంతో రవి ఆమెను వెతుక్కుంటూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో చున్నీతో ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తల్లి కోసం ఆరాటపడుతున్న పసి హృదయాలను చూసి చూసిన ప్రజలు కంటతడి పెట్టుకున్నారు.


