పెండింగ్ క్లెయిమ్‌లు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న సీఎంపీఎఫ్, పెన్షన్ క్లెయిమ్‌లన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని గోదావరిఖని రీజియన్ సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో 4వ విడత ప్రయాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్‌కు సంబంధించి 1,332 పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీలను ఏరియా జీఎంకు అందజేశారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడికి సీఎంపీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ కోసం అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్‌లోని పెండింగ్‌లను జీరో పెండింగ్‌లోకి తేవడం లక్ష్యంగా ప్రయాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏరియా పరిధిలో ఉన్న పెండింగ్ క్‌లైమ్‌లను సంక్షేమ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్‌వోటు జీఎం ఎం.సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, సీనియర్ పీవో సురేందర్, పిట్ సెక్రెటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు.


