పకడ్బందీ ఏర్పాట్లు
కైలాస్‌నగర్: ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధి కార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప ట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు. ప్రజలు, వీఐపీలు సభ వేది కకు చేరుకునేలా ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌లైట్లను సైతం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలను సిద్ధం చేశారు. ఏర్పాట్ల ను కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, మౌనిక ఉన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు


