నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇంద్రవెల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉ ట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్ అన్నారు. మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సిబ్బంది ఉన్నారు.
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
నార్నూర్: పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ కాజల్‌సింగ్ హెచ్చరించారు. మండలంలోని నాగల్‌కొండ గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, రెచ్చగొట్టేలా వ్యవహరించినా కేసులు తప్పవని అన్నారు. ఆమె వెంట సీఐ అంజమ్మ, సిబ్బంది గోవింద్, నాగోరావు తదితరులు ఉన్నారు.


