ఔను..వాళ్లంతా ‘చేయి’ కలిపారు
● ఒక్కటైన కాంగ్రెస్ అసమ్మతి నేతలు
కై లాస్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేతలు చేతులు కలుపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డి, రాజకీయంగా తలెత్తిన విభేదాలతో ‘కంది’ని వ్యతిరేకిస్తూ వచ్చిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వారిని ‘కంది’ శాలువాలతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అరగంటపాటు సరదాగా మాట్లాడుకున్నారు. స్థానిక ఎన్నికల ముంగిట నేతలంతా ఒక్కటి కావడం పార్టీకి కలిసి రానుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


