ప్రశాంత ఎన్నికలపై దృష్టి సారించాలి
సాత్నాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టీ.వెంకన్న అన్నారు. సోమవారం మాంగుర్ల, మేడిగూడ ఆర్, సైద్పూర్ క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్ రాజు పాల్గొన్నారు.
పత్రాలు క్షుణ్నంగా పరిశీలించాలి
తాంసి: అభ్యర్థులు వేసే నామినేషన్ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు టి.వెంకన్న ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం తాంసి, కప్పర్ల, బండల్‌నాగాపూర్ లో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంపీడీవో గడ్డం మోహన్‌రెడ్డి,
తహసీల్దార్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
భీంపూర్: ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. సోమవారం పిప్పల్ కోటి, దండోరా క్లస్టర్లను ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు.


