జిల్లా కేంద్రంలో సుదర్శన్‌రెడ్డి పర్యటన
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించా రు. సీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగసభకు సంబంధించి పట్టణంలోని డైట్ కళాశాల, ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ ఛాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. అంతకు ముందు మావల బైపాస్ వద్ద ఎమ్మెల్యే బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్ సుజాత, తదితరు లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.


