సీనియర్లను మినహాయించాలి
ఆదిలాబాద్‌టౌన్: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్‌టీఎఫ్‌ఐ పోరాట కార్యాచరణలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లె టర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. సీనియర్ టీచర్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వే యాలని కోరారు. దీని కోసం దేశవ్యాప్తంగా అ న్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రధానమంత్రికి లే ఖలు రాస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శులు స్వామి, గౌస్ మొహియుద్దీన్, సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, వివిధ మండలాల బాధ్యులున్నారు.


