గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పని చేయాల ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవాభవ న్‌లో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. పా ర్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసినా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా వారి గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీచేసే ఆశావహుల వివరాలు సేకరించారు.


