రైతులకు అండగా సహకార సంఘాలు
కై లాస్‌నగర్: సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. అఖిల భారత సహకార వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో శుక్రవారం ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని, సహకార సంఘా ల ఆధ్యుడు జవహర్‌లాల్ నెహ్రూ, గాంధీజీ చి త్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహకారజెండా ఆవిష్కరించారు. బ్యాంకు ఉద్యోగులతో కలిసి సామూహిక సహకార గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల ప్రజ లు, రైతుల హితం కోసమే సహకార సంఘాలు ఏర్పడ్డాయని అన్నారు. అన్నదాతకు పంట రుణాలతో పాటు ఎరువులు, ఆధునిక యంత్రపరికరాలు స్థానికంగానే అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సంఘాలను మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఇందులో బ్యాంక్ డీజీఎంలు భాస్కర్‌రెడ్డి, వెంకటస్వామి, దేవేందర్, మేనేజర్లు శేఖర్, ప్ర వీణ్, ఏజీఎంలు, బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


