సాగు మానుకోవడమే నయం..
నేను 38 ఎకరాల్లో పత్తి పత్తేసిన. 8 ఎకరాలు నా సొంత భూమి. మిగతాది కౌలుకు తీసుకున్న. ప్రస్తుతం 30 క్వింటాళ్ల వరకు చేతికి రాగా యార్డుకు తీసుకొచ్చిన. మొదటిసారి తెచ్చినప్పుడు తేమ తక్కువగా ఉండడంతో సీసీఐ వాళ్లు కొన్నరు. ఈ సారి ఇంటివద్ద ఎనిమిది రోజుల పాటు ఆరబెట్టినా 14 శాతం వచ్చింది. చేసేది లేక ఈడనే ఆరబెట్టిన. సాగు చేస్తే అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి తప్ప ఏం మిగలట్లేదు. ఇప్పటికే వర్షాలతో నష్టపోయాం. వ్యవసాయం మానుకొని కూలీ పనిచేసుకోవడం నయం అనిపిస్తుంది.
– జి.నవీన్, రైతు, లక్ష్మిపూర్, జైనథ్


