వాతావరణం
రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ఇప్పటికే వారమైంది..
ఇచ్చోడ: సోయా సాగు చేస్తే 40 క్వింటాళ్ల దిగుబ డి వచ్చింది. అమ్ముదా మని ఇచ్చోడ మార్కెట్ యార్డుకు వారం కిందట తీసుకొచ్చిన. తేమ ఉందని కొనమన్నరు. నాలుగు రోజులు ఆరబెట్టిన. నిల్వలు పెరిగాయని ఇప్పటికే మూడు సార్లు కొనుగోళ్లు బంద్ చేసిండ్రు. ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి ఉంది.
– కళ్లె గవాస్కర్‌రెడ్డి, అడేగామ(కే)
పడిగాపులు తప్పట్లే
నేరడిగొండ: సోయా పంటను అమ్మడానికి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వారం క్రితం తీసుకొచ్చిన. జోకితే 27 క్వింటాళ్లు అయింది. లారీలో లోడ్ చేయకపోవడంతో వారం నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్నా. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఏమొస్తది.
– ఒరుస రాజు, రైతు, కుమారి గ్రామం
రంగు మారిందని కొనట్లే..
తాంసి: ఈ సారి ఆరెకరా ల్లో సోయా సాగు చేసిన. పంట కోత సమయంలో వర్షాల కారణంగా సోయా తడిసింది. 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. నాలుగు రోజుల క్రితం తీసుకొచ్చిన. కొద్దిగా రంగు మారింది. నాణ్యతగా లేదని అధికారులు కొనమన్నరు. వర్షాలకు తడిసిందని చెప్పినా పట్టించుకోవట్లే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే కొంటమంటున్నరు.
– కాడిగిరి గంభీర్, తాంసి
పది రోజులైతంది
బోథ్: నేను ఎనిమిదెకరా ల్లో మొక్కజొన్న సాగు చేసిన. 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట ను యార్డుకు తెచ్చి పది రోజులైతంది. ఇవ్వాళ పంటను సంచుల్లో నింపారు. ఇంకా లారీల్లో తరలించలేదు. ఎన్ని రోజులైతదో తెలువదు.
– రాథోడ్ రాము, కుచ్చిరాల, బోథ్
వాతావరణం
వాతావరణం
వాతావరణం


