అపూర్వం.. @ 40
ఖండాలు దాటి బడికి వచ్చిన పూర్వవిద్యార్థులు నాలుగు దశాబ్దాల తర్వాత చదువులమ్మ ఒడికి.. సమ్మేళనానికి వేదికై న ‘సెయింట్ జోసఫ్’
వారంతా 40 ఏళ్ల క్రితం పదో తరగతి పూర్తి చేశారు.. ఉన్నత చదవులు ఇతర ప్రాంతాల్లో పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.. కట్ చేస్తే నాటి స్నేహితులంతా మళ్లీ బడిలో కలువాలని నిర్ణయించుకున్నారు.. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు.. ఆరు నెలలుగా అందరి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించారు. అనుకున్నట్లుగా నాలుగు దశాబ్దాల తర్వాత అంతా ఒకే చోటుకు చేరారు. ఇందుకు జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ వేదికై ంది. 1984–85లో పదో తరగతి బ్యాచ్‌లో 40 విద్యార్థులు ఉండగా శుక్రవారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 26 మంది హాజరయ్యారు. జిల్లాలో నివాసముండే వారితో పాటు అమెరికా, ఖతర్, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి సైతం హాజరయ్యారు. ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకుంటూ యోగాక్షేమాలు తెలుసుకున్నారు. బాలల దినోత్సవం రోజున నాడు చదువుకున్న తరగతి గదిలోకి వెళ్లి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరందరి వయస్సు 55 ఏళ్లకుపైబడే కావడం విశేషం. వీరిలో డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డవారు ఉన్నారు. పూర్వ విద్యార్థులు బట్టు దేవేందర్, గ్యాస్‌బర్, వెంకట్ రెడ్డి, రజనీ, కళ్యాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్‌టౌన్
ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు


