వినతుల వెల్లువ
కై లాస్‌నగర్: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు బారులు తీరి కలెక్టర్ రాజర్షి షాకు తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, స్వయం ఉపాధి, భూ సమస్యలే అధికంగా ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..


