ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఎంపిక పోటీలు
న్యూస్‌రీల్
జిల్లా కేంద్రంలో సోమవారం రగ్బీ, హాకీ, యోగాసన, హ్యాండ్‌బాల్ క్రీడాంశాల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ జోనల్, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి.
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఈ రైతు పేరు కేమ రామయ్య. తాంసి మండలంలోని వడ్డాడి గ్రామం. తన సంబంధీకులకు చెందిన ఎగ్గేడి దేవుబాయి పేరిట 3.25 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండగా, పత్తి దిగుబడి చేతికొచ్చింది. గడిచిన శనివారం స్లాట్ బుక్ చేసుకు న్నాడు. ఈ సమయంలో ఎకరానికి 13 క్వింటాళ్ల చొప్పున 45 క్వింటాళ్ల వరకు విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం దిగుబడి 30 క్వింటాళ్ల వరకు ఉండగా, అంతే నమోదు చేశాడు. సోమవారం బండిలో పత్తి నింపుకొని ఆదిలా బాద్ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. దిగుబడిని యార్డులో దించాడు. అయితే సీసీఐ ఎకరానికి 7 క్వింటాళ్ల చొప్పునే తీసుకుంటుందని చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ లెక్కన తాను తెచ్చిన దాంట్లో 24 క్వింటాళ్ల వరకే విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. మిగతా ఆరు క్వింటాళ్లు ఏమి చేయాలి.. మరోవైపు తేమ 14, 15 శాతం వరకు రావడంతో సీసీఐ కొనుగోలు చేసే పరిస్థితి లేదు.. ఈక్రమంలో దిక్కుతోచని రైతు పత్తిని యార్డులోనే ఉంచేశాడు. ఇతనొక్కడే కాదు.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకొచ్చిన అనేక మంది రైతులదీ ఇదే దుస్థితి.
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఎంపిక పోటీలు


