ఎన్నికలు వదిలి.. రైతుల గురించి ఆలోచించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు వదిలి.. రైతుల గురించి ఆలోచించాలి

Nov 4 2025 7:08 AM | Updated on Nov 4 2025 7:08 AM

ఎన్నికలు వదిలి.. రైతుల గురించి ఆలోచించాలి

ఎన్నికలు వదిలి.. రైతుల గురించి ఆలోచించాలి

25 శాతం వరకు తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్‌టౌన్‌/సాత్నాల/జైనథ్‌: సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఎన్నికల ను వదిలి రైతుల గురించి ఆలోచించాలని తెలంగా ణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌కు విచ్చేశా రు. ముందుగా కుమురంభీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్‌ యార్డుకు వెళ్లి పత్తి రైతులతో మా ట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ రాజర్షిషాతో ఫోన్‌లో మాట్లాడారు. సీసీఐ 12 శాతం తేమ మించితే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రైతులు తక్కువ ధరతో ప్రైవేట్‌ వ్యాపారులకు పంట విక్రయించి నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర టెక్స్‌టైల్స్‌, వ్య వసాయశాఖ, సీసీఐ అధికారులతో మాట్లాడి సమ స్య పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అనంత రం విలేకరులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఎన్ని కల్లో ఓడినా.. గెలిచినా ఏమి నష్టం లేదని, మోంథా తుపాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఆదిలాబాద్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు గొడం నగేశ్‌, పాయల్‌ శంకర్‌ బీజేపీకి చెందినవారై ఉండి కూడా పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారు వెంటనే కేంద్రంతో మాట్లాడి తేమ 25 శాతం ఉన్నా పత్తిని కొనుగోలు చేసేలా చూడాలని తెలి పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి భోరజ్‌ మండలంలోని కొరటా–చనాఖా బ్యారేజీ వద్దకు చేరుకున్నా రు. పనులు పరిశీలించి నిర్వాసిత రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 213 మంది నిర్వాసితులకు వెంటనే నష్ట పరి హారం అందించడంతో పాటు కాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కాగా, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ అక్కడే వంటావార్పు నిర్వహించారు. అక్కడి నుంచి జైనథ్‌లోని శ్రీ లక్ష్మీనారా యణస్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట జాగృతి జిల్లా నాయకులు వేణుగోపాల్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకులు రంగినేని శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement