బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి 38 మంది అర్జీదారులు వచ్చి ఎస్పీ కి సమస్యలను విన్నవించారు. ఈ మేరకు సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులకు ఎస్పీ ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలా గే ప్రజలు తమ సమస్యలను నేరుగా కాకుండా వా ట్సాప్ నం.8712659973లో కూడా దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి, గుడుంబా వంటి సమాచారాన్ని తెలియజేయవచ్చని తెలి పారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, జైస్వాల్ కవిత, వామన్ పాల్గొన్నారు.
అతివలకు అండగా షీటీం
జిల్లా వ్యాప్తంగా అతివలకు అండగా ఆదిలాబాద్ షీటీం బృందం 24 గంటలు సేవలందిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా 26 ఫిర్యాదులు రాగా, 12 కౌన్సెలింగ్ ద్వారా మహిళలకు సేవలు అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35 కళాశాలలను సందర్శించి విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్‌క్రైమ్‌తో మోసపోతున్న ఘటనలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 101 వసతిగృహాలను తనిఖీ చేసి మహిళల వేధింపులను అరికట్టడానికి తమవంతు పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. షీటీంపై నమ్మకంతో సమాచారం అందిస్తుండడంతో రెండు బాల్య వివాహాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. షీటీం బృందాన్ని డయల్ 100, 8712659953 నంబర్‌పై సంప్రదించవచ్చని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు పంపవద్దని సూచించారు.


