జాతీయ సదస్సుకు కోల కిరణ్
ఆదిలాబాద్‌టౌన్: నూతన జాతీయ విద్యా విధానం స దస్సుకు డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కోల కిరణ్‌కుమార్ ఎంపికయ్యారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఈనెల 30, 31తేదీల్లో నిర్వహించే సదస్సుకు హాజరు కానున్నారు. ఇందులో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించి చర్చించనున్నారు. ఎస్‌సీఈఆర్టీ సభ్యులతో కలిసి సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానంను తెలియజేయనున్నారు. విద్యారంగంలో తీసుకోవాల్సిన సంస్కరణలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈయన ఎంపికపై పలువురు అభినందనలు తెలిపారు.


