భీంపూర్: రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో పీఎం–జన్మన్ పథకం ద్వారా మంజూరైన రహదారి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గడువులోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ఈఈ శివరాంను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి ఇక్కట్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురో గతి, శానిటేషన్ నిర్వహణ, ప్రజాసేవల అమలు పై సమీక్షించారు. గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించా రు. మెనూప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ఆయన వెంట తహసీల్దార్ నలంద ప్రియ, పంచాయతీ కార్యదర్శి సతీశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు న్నారు.


