చెట్టుకు కట్టేసిన ఘటనపై విచారణ
బోథ్: సొనాల మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారు భర్త మారుతిని ఇంటిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ సత్యనారాయణ చెట్టుకు కట్టేసి, నిలదీ యడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బుధవా రం ‘సాక్షి’ మెయిన్‌లో ‘ఇందిరమ్మ లబ్ధిదారుడిని చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్’ శీర్షికన కథనం ప్రచురితమైంది.స్పందించిన జిల్లా యంత్రాంగం బుధవారం అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈ వో, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, హౌసింగ్ అధి కారులు మండల కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. ముందుగా అధికారులు కోట(కె) గ్రా మంలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు దీక్ష నిర్మి స్తున్న ఇంటిని పరిశీలించారు. అక్కడ లబ్ధిదారు లేకపోవడంతో, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతగా నిర్మించకపోవడంతోనే సదరు కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వడానికి లబ్ధిదారు నిరాకరించినట్లు వారు తెలిపా రు. అనంతరం సొనాల మండల పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్టర్ సత్యనారాయణతో పాటు లబ్ధిదారు దీక్షను విచారించారు. ఇంటిని నాణ్యతగా కట్టడం లేదని, అందుకే డబ్బులు ఇవ్వలేదని, ఈ క్రమంలోనే తన భర్తను సత్యనారాయణ చెట్టు కు కట్టేసి, కొట్టాడని అధికారులతో దీక్ష పే ర్కొంది. కాగా, ఇందిరమ్మ ఇంటిని సదరు కాంట్రాక్టర్ నిర్మించకూడదని అధికారులు ఆదేశించారు. ఎంపీడీవో రాజేశ్వర్, స్థానిక పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సత్యనారాయణపై కేసు..
కాంట్రాక్టర్ సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇందిరమ్మ లబ్ధిదారు భర్త మారుతిని చెట్టు కు కట్టేసి నిలదీసిన ఘటనపై పోలీసులు మంగళవారం ఇరువురిని స్టేషన్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మారుతి ఫిర్యాదు మేరకు సత్యనారా యణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్సై ధారాసింగ్ తెలిపారు.
కాంగ్రెస్ నుంచి ‘కాంబ్లే’ సస్పెండ్
ఇందిరమ్మ లబ్ధిదారు భర్తను చెట్టుకు కట్టేసి నిలదీసిన ఘటనపై కాంట్రాక్టర్ అయిన కాంగ్రెస్‌కు చెందిన కాంబ్లే సత్యనారాయణపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. మానవతా విలువలు లేని వారికి పార్టీలో స్థానం లేదని పేర్కొంటూ అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు బోథ్ ని యోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ప్రకటించారు. బుధవారం ఆయన సొనాలలో మాట్లాడారు. జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని, బాధితుడికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని జిల్లా కమిటీ తీర్మానించినట్లు ఆయన ఈ సంద్చర్భంగా పేర్కొన్నారు.
చెట్టుకు కట్టేసిన ఘటనపై విచారణ


