
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్‌టౌన్: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయరన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, జిల్లాలో గతంలో నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో 50 మంది పోలీసు సిబ్బంది తమ ప్రాణా లను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. బాధిత కుటుంబాలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు హాజరయ్యారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివా ళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్రవర్ధన్, డీఎంహెచ్‌వో నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్‌ఎం, రెండో బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.