
కనిపించని డబ్బా వసూళ్లు
ఆదిలాబాద్‌టౌన్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భోరజ్ చెక్‌పోస్టు మంగళవారం నిర్మానుష్యంగా మారింది. చెక్‌పోస్టు వద్ద సిబ్బంది వాహనాలు ఆపిన దాఖలాలు కనిపించ లేదు. ఇటీవల ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రవా ణాశాఖ చెక్‌పోస్టుల్లో దాడులు జరిపిన విషయం విదితమే. ఇందులో భాగంగా భోరజ్ చెక్‌పోస్టు వద్ద లెక్కకు మించి రూ.లక్ష 26వేలు లభించా యి. అయితే ఈ చెక్‌పోస్టు వద్ద ఏర్పా టు చేసిన డబ్బాలో లారీడ్రైవర్లు, క్లీనర్లు డబ్బులు వేసి వెళ్తుండగా గమనించారు. కొన్నేళ్లుగా జరుగుతు న్న ఈ తంతు బహిరంగ రహస్యమే. అయితే ఏసీబీ దాడులతో ఒక్కసారిగా చెక్‌పోస్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇది వరకు ప్రతి రోజు వేలాది వాహనాలు చెక్‌పోస్టు వద్ద ఆగు తూ వెళ్లేవి. ముద్ర వేసుకొని డబ్బాలో డబ్బులు వేసేవారు. మంగళవారం ఆ సందడి కనిపించలేదు. చెక్‌పోస్టు వద్ద డబ్బా సైతం తొలగించిన ట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరిశీలించగా.. చెక్‌పోస్టు వద్ద ఒక ఆపరేటర్ విధులు నిర్వహిస్తూ కనిపించాడు. ఇదివరకు పలువురు రవా ణాశాఖాధికారులు, హోంగార్డులు, ప్రైవేట్ వ్యక్తులు ఉండేవారు. అయితే ఈ అక్రమ వసూళ్లు ఇంతటితో నిలిచిపోతాయా.. మళ్లీ కొనసాగుతాయా అనే విషయాలపై పలువురు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.