కార్తీకం..పవిత్రం
న్యూస్‌రీల్
కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. అటు హరికి, ఇటు హరుడికి, వారిద్దరి తనుయుడైన అయ్యప్పకు కూడా ప్రీతిపాత్రమైన మాసమిది. నేటి నుంచి ప్రారంభం కానుంది.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బజార్‌హత్నూర్ : జాతర్లలో పాల్గొన్న ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ తదితరులు
నేరడి గొండ: గుస్సాడి టోపితో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
లక్ష్మీపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
‘రైజింగ్’ సర్వేలో అందరూ పాల్గొనాలి
కైలాస్‌నగర్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భవిష్య త్ రూపకల్పనలో ప్రతీపౌరుడి భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్ర జల అభిప్రాయాలను తెలుసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వరకు చేపట్టనున్న సర్వేలో జిల్లా ప్రజలు www. telangana. gov. in/ telanganarising వెబ్‌సైట్ ద్వారా తమ అమూల్యమైన సలహాలు, సూచనలు నమోదు చేయాలని సూచించారు. శక్తివంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని స్పష్టం చేశారు.
అంబరాన్నంటిన
సంబురం
జిల్లావ్యాప్తంగా సోమవారం దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు తమ ఇళ్లతో పాటు వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. అష్టైశ్వర్యాలు అనుగ్రహించాలని అమ్మవారిని వేడుకున్నారు. చీకటి పడగానే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా బాణాసంచా కాల్చారు. మరోవైపు గిరి గ్రామాల్లో దండారీ సందడి కనిపించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, నేరడిగొండ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.
– ఆదిలాబాద్/నేరడిగొండ/ఇంద్రవెల్లి
సంస్కృతిని భావితరాలకు అందించాలి
సిరికొండ: గిరిజన సంస్కృతిని భావితరాలకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని రాయిగూడలో అశోక చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం దండారీ ఉత్సవాలు నిర్వహించారు.ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందులో ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, ట్రస్టు చైర్మన్ అశోక్ పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ఆదివాసీలు దండారీ సంస్కృతిని తరతరాలుగా కాపాడుకోవడం గొప్ప విషయమన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్‌రెడ్డి, పాయల్ శరత్ తదతరులు పాల్గొన్నారు.
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం
కార్తీకం..పవిత్రం


