
మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ఆదిలాబాద్‌టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబ నకు కృషి చేస్తున్నట్లు పల్నా పథకం రాష్ట్ర లీడ్ రాజారాం ప్రసాద్ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న పల్నా పథకంపై జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో క్రె చెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. పనులకు వెళ్లే తల్లులు తమ చిన్నారులను ఈ కేంద్రాల్లో వదిలి వెళ్లవచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 5 చొప్పున ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీ, సంజయ్‌నగర్, మహాలక్ష్మివాడలో గుర్తించిన కేంద్రాలను సందర్శించారు. ముందుగా కలెక్టర్ రాజర్షిషాను రాష్ట్ర లీడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మిల్కా, సీడీపీవోలు సౌందర్య, శారద, ఉమాదేవి, నర్సమ్మ, వినూత్న పాల్గొన్నారు.