వెలుగుల పండుగొచ్చే.. | - | Sakshi
Sakshi News home page

వెలుగుల పండుగొచ్చే..

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

వెలుగ

వెలుగుల పండుగొచ్చే..

‘భోరజ్‌’లో ఏసీబీ దాడులు లెక్కకుమించిన నగదు రూ.1.26లక్షలు స్వాధీనం ప్రైవేట్‌ వ్యక్తులతో అక్రమాలకు తెర డబ్బాలో డబ్బులు వేస్తున్న వాహనదారులు అధికారులను ప్రశ్నించిన ఏసీబీ.. నగదు తమది కాదని తప్పించుకునే యత్నం

టపాసులు కొనుగోలు చేస్తున్న జనం

ఆదిలాబాద్‌టౌన్‌: భోరజ్‌ చెక్‌ పోస్టు.. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా వెళ్లే వాహనా లను తనిఖీ పేరిట అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలే దు. తరచూ ఏసీబీ దాడులు జరిగినప్పుడు లెక్క కు మించి నగదు పట్టుబడుతుండడం గమనార్హం. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వాహనదారులకు ఆన్‌లైన్‌ విధానంపై అవగాహన కల్పిస్తామని చెబుతూ ఇక్కడి అధికారులు అందినకాడికి దండుకుంటున్న ట్లు తెలుస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే డబ్బాలో రూ.లక్ష జమ అయితే.. రోజుకు ఎంత జమ అవుతుందోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ అక్రమ వసూళ్లలో కింది నుంచి పైస్థాయి అధికారు ల వరకు వాటాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. ఇక్కడ డ్యూటీ అంటే కాసుల పంట అనే ప్ర చారం ఉంది. గతంలో ఇక్కడ విధుల కోసం అధి కారుల గొడవలు రాష్ట్రస్థాయి వరకు వెళ్లిన విషయం విదితమే. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ మార్పు కానరావడం లేదు. డబ్బులు పట్టుబడినప్పుడు నామ్‌కే వాస్తే వివరణ తప్పా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల ముందే లారీ డ్రైవర్లు, క్లీనర్లు డబ్బాలో నగదు వేయడాన్ని చూసి ఆశ్చర్యపోయా రు. ఎందుకు డబ్బులు వేస్తున్నారంటే మరికొంత ఎక్కువ వేస్తామని చెప్పడం అవినీతి ఏ మేరకు పేరుకుపోయిందో తెలిసిపోతోంది.

లెక్కకు మించిన డబ్బులెక్కడివి..

ఈ చెక్‌పోస్టు జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉంటుంది. ఈ మార్గం గుండా వెళ్లే భారీ వాహనా లకు సంబంధించి పర్మిట్‌, ఓవర్‌లోడ్‌, లైసెన్సులు, ట్యాక్స్‌లు, ఇతరత్రా పత్రాలు సరిగా ఉన్నాయా.. లేదా అనేది చెక్‌ చేసి పంపించాల్సి ఉంటుంది. 24 గంటల పాటు అక్కడికి వచ్చిపోయే వాహనాల తని ఖీతో చెక్‌పోస్టు ప్రాంతం సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రవాణాశాఖ అధికారులతో పా టు ప్రైవేట్‌ సిబ్బంది వాటికి సంబంధించిన ప్రక్రి య చేపట్టి లోటుపాట్లు గుర్తించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే విధిగా సాగుతుంటుందనేది బహిరంగ రహస్యమే. ఏటా ఏసీబీ అధికారులు తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తారు. అయితే ప్రతీసారి లెక్కకు మించి నగదు లభిస్తుండడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌ 4న ఏసీబీ దాడి చేయగా, లెక్కకు మించి రూ.62,500 నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిపిన దాడుల్లోనూ లెక్కకుమించి డబ్బులు లభించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

షరామామూలే..

ఈ చెక్‌పోస్టు వద్ద డబ్బుల వసూలు కొన్నేళ్లుగా షరా మామూలుగానే జరుగుతోంది. ఉత్తరభారతం వైపు నుంచి జిల్లా మీదుగా దాదాపు రోజుకు 3వేల నుంచి 4వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. రవాణాశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేసినప్పుడు ఓవర్‌లోడ్‌ ఉందా.. సరుకులు వేసిన సమయంలో ప్రస్తుతం వాటికి సరితూగిందా లేదా, జీరో లోడ్‌ తీసుకెళ్తున్నారా.. పర్మిట్‌లో ఉన్న రోడ్డు మార్గం గుండానే వెళ్తున్నారా అనే విషయాలను పరిశీలిస్తారు. ఒకవేళ ఇందులో లోటుపాట్లు ఉంటే జరిమానాతో పాటు వేలాది రూపాయలు అక్రమంగా తీసుకుంటారనేది బహిరంగ చర్చ సాగుతోంది. ఈ విషయమై రవాణా శాఖ అధికారులను వివరణ కోరగా, స్పందించేందుకు వారు నిరాకరించారు. మరికొంత మంది అధికారులు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకోగా, ఇంకొందరు అందుబాటులోకి రాలేదు.

భోరజ్‌ చెక్‌పోస్టు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. వెలుగుల పండుగను నేడు వైభవంగా నిర్వహించుకు నేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. లక్ష్మీపూజలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం టపాసుల మోతకు చిన్నా పెద్దా రెడీ అవుతున్నారు.

భోరజ్‌ మండలకేంద్రంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు తనిఖీ చేపట్టారు. నిబంధనల ప్రకారం వచ్చిన డబ్బులు పక్కనబెడితే, రూ.లక్ష 26వేలు అదనంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఇక్కడ ఇద్దరు ఆర్టీఏ అధికారులతో పాటు ఒక హోంగార్డు, ఒక సెక్యూరిటీ, నలుగురు ప్రైవేట్‌ వ్యక్తులు ఉన్నారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. ఆ డబ్బులతో తమకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. కార్యాలయ ఆవరణలో ఓ డబ్బా ఏర్పాటు చేయగా, వాహన డ్రైవర్లు, క్లీనర్లు అందులో నగదు వేసి పత్రాలపై ముద్ర వేసుకొని వెళ్లడాన్ని గమనించారు. ఒక్కో వాహనానికి రూ.300 నుంచి రూ.500, ఆపై డబ్బులు వేసినట్లు ఏసీబీ అధికారులు గమనించారు. గంటల వ్యవధిలోనే రూ.లక్షకు పైగా జమ కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ లెక్కన రోజు రూ.లక్షల్లో వసూలవుతున్నట్లు తెలుస్తోంది. అదనపు డబ్బులను ఏసీబీ అధికారులు సీజ్‌ చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. ఇక్కడ జరిగిన తంతుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

వెలుగుల పండుగొచ్చే..1
1/3

వెలుగుల పండుగొచ్చే..

వెలుగుల పండుగొచ్చే..2
2/3

వెలుగుల పండుగొచ్చే..

వెలుగుల పండుగొచ్చే..3
3/3

వెలుగుల పండుగొచ్చే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement